Home  »  TV News  »  సింగర్ ఝాన్సీ పేజీని ఫాలో కొట్టిన నవదీప్... డాన్స్ చేసిన బిందు... రెడ్ ఇచ్చిన అభిజిత్

Updated : Aug 15, 2026

బిగ్ బాస్ అగ్నిపరీక్ష నిజంగానే హీట్ పుట్టిస్తోంది. ఇక ఈ షోలో ఒక్కొక్కరిగా వచ్చి వాళ్ళ వాళ్ళ టాలెంట్ ని చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు సూర్యాపేట నుంచి సింగర్ ఝాన్సీ థర్డ్ కంటెస్టెంట్ గా వచ్చింది. "మాది కోమటికుంటా అనే పల్లెటూరు. మేము ముగ్గురం ఆడపిల్లలం. అమ్మానాన్న తమ్ముడు. నేను ఒక ఫోక్ సింగర్ ని కూడా. పల్లెల్లో జానపద పాటలు పాడుతుంటాను. పిజి ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసాను. కొడుకులు ఉంటె చేతికి సాయం వచ్చేవాడు కానీ  ఆడపిల్లలైపోయారు అన్న ఆలోచన మా నాన్నకు రాకుండా నేను మా నాన్నకు ఎంతో సాయం చేస్తుంటాను పొలం పనుల్లో కూడా. 2016 లో పొలం దున్నడం నేర్చుకున్న. నేను మూడో అమ్మాయిని . మళ్ళీ ఆడపిల్ల పుట్టిందా అంటూ మా అమ్మ వాళ్ళు ఏడ్చారంతా. కానీ ఈరోజు నువ్వు కన్నది ఆడపిల్లను కాదు నలుగురికి ఆదర్శంగా ఉండే ఒక మగరాయుడి లాంటి  బిడ్డను కన్నావు ఇలాంటి బిడ్డను కనాలి అంటూ అమ్మానాన్న దగ్గరకు వచ్చి చెప్తుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు ఇంటర్ లో 926. నేను ఇంట్లో బాగా అల్లరి చేసేది. నా 3 వ తరగతి నుంచి నేను ఫోక్ సాంగ్స్ పాడుతూ ఉన్నాను. నా వాయిస్ బాగుందన్న ప్రజల నుంచి ఆదరణ వచ్చింది సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. కానీ నాకు అవకాశాలు రాలేదు. ఈ బిగ్ బాస్ ఒక ప్లాట్ఫారగా నా వాయిస్ ని కొన్ని కోట్ల మందికి పరిచయం చేయాలి నేనేంటో ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడున్న యూత్ వ్యవసాయం అంటేనే ముందుకు రావట్లేదు వాళ్లకు ఇన్స్పిరేషన్ గా ఉండాలని నేనే చేసే ప్రతీ పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉంటాను. " అని చెప్పింది.

వెంటనే నవదీప్ "నీ ఐడి ఏంటి నాన్న " అని  అడిగి సింగర్ ఝాన్సీ  పేజీకి ఫాలో కొట్టాడు. తర్వాత ఒక జానపద పాట పాడి అలరించింది. వెంటనే శ్రీముఖి "మట్టిలో మాణిక్యం " అని  పొగిడింది. "నాన్నకు గవర్నమెంట్ జాబ్ ఒక్క బిడ్డ అన్నా కొట్టాలి అనే కల ఉంది. నేను గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నా. ఎస్ ఐ , కానిస్టేబుల్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నా. ఈ పొలం పని, పాటలు ఇవన్నీ బాలన్స్ చేయడం కొంచెం కష్టం ఉంది " అని చెప్పింది. "ఇప్పుడు రైతులకు ఉన్న కష్టాలు ఏంటి "అని నవదీప్ అడిగాడు. "పెట్టుబడి పెట్టకుండా పంట పండదు. కానీ ఆఖరికి ఆ పెట్టుబడి పెట్టినంత కూడా రాదు మనకు. కానీ వ్యవసాయాన్ని మాత్రం వదిలిపెట్టలేము. రాత్రి పగలు ఆ ప్రకృతితోనే పోటీ చేయాలి " అంటూ చెప్పింది. "చాల బాగా పెంచారమ్మ నిన్ను " అంటూ నవదీప్ మెచ్చుకున్నాడు. ఇక శ్రీముఖి "నువ్వు చాలామంచిదానిలా ఉన్నావ్. కానీ అక్కడ చాలామంది తిక్క తిక్కగా ప్రవర్తిస్తారు. నామినేషన్స్ అంటారు. ఏవేవో అంటారు. అవన్నీ భరిస్తావా " అని అడిగింది. "భరించాలి. నా వరకు రానంత వరకు ఓకే కానీ నా వరకు వస్తే ఊరుకోను " అని చెప్పింది. "గొడవలు పెడతావా " అని నవదీప్ అడిగాడు. "బయట వాళ్ళతో ఏమీ జరగదు ఇంట్లో మా నాలుగురమే కొట్టుకున్న తిట్టుకున్ననే " అని చెప్పింది. "ఏముంటాయి గొడవలు " అని నవదీప్ అడిగేసరికి "రిమోట్ దగ్గర అమ్మ సీరియల్స్ ఇంకో అక్క న్యూస్ అంటది " అని చెప్పింది. "నేను ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తున్నా . బిగ్ బాస్ మొదటి రోజు నామినేషన్స్ వచ్చాయి. బిగ్ బాస్ కి ఝాన్సీ వద్దు సెట్ అవ్వదు " అని నేను చెప్పా. దానికి నువ్వేమంటావ్ అని అడిగింది శ్రీముఖి. "నేను సెట్ కాదు అని మీరు చెప్తున్నప్పుడు మీరు ఎలా సెట్ అవుతారో మీరు చెప్పండి " అని అడిగింది . "నేను సెట్ అవుతాను కాబట్టే షో వాళ్ళు నన్ను తీసుకున్నారనిపిస్తోంది " అంది శ్రీముఖి.

"అని నువ్వు అనుకుంటున్నావు నేను బెటర్ అని నేను అనుకుంటున్నా " అంటూ శ్రీముఖిని నువ్వు అనేసరికి జడ్జెస్ కూడా ఈ విషయాన్నీ పాయింట్ అవుట్ చేశారు. "ఎలా బెటర్ అంటావా చెప్పు " అంది శ్రీముఖి. "ఏదన్న టాస్క్ ఇవ్వండి. అది ఓడిపోతే నేను వీక్ అని అనుకుంటా " అంది. "దారి జూడు " సాంగ్ కి బింధుమాధవితో డాన్స్ చేయించింది ఝాన్సీ. ఇక నవదీప్ ఐతే "నీలాంటి కథలు బయటకు వెళ్ళాలి " అంటూ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. బిందు మాధవి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చింది. "నువ్వు ఉంటె ఈ షోలో ఉంటె చూడాలనిఉంది. నీలో ఒక అమాయకత్వం ఉంది. అది ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి " అని చెప్పింది. ఇక అభిజిత్ ఐతే "నీకో విషయం చెప్పాలి నా ఫేవరేట్  వెహికల్ ట్రాక్టర్. చాలా ఇష్టం నాకు దాన్ని నడపడం. నేనెప్పుడూ స్ట్రెస్ ఫీలైనా ఫార్మ్ కి వెళ్ళిపోయి ట్రాక్టర్ నడుపుకుంటూ కూర్చుంటా .చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు నువ్వు చాలా నచ్చావ్ ఝాన్సీ . ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావ్. ఏదైనా స్ట్రైట్ గా చెప్తావ్. శ్రీముఖి టాస్క్ ఇచ్చినప్పుడు మీరు నుంచి నువ్వుకు షిఫ్ట్ అయ్యావ్ చూడు అది ఈ హౌస్ కి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్లకు మర్యాద ఇవ్వకూడదు. ఆ లక్షణం ఉండాలి. నెక్స్ట్ రౌండ్ లో కొంచెం సానబెట్టాలి " అని చెప్తూ రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.